కరీంనగర్ · August 22, 2026

వీణవంకలో ఇంటింటికీ సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

వీణవంక మండలంలోని 17 గ్రామాల్లో రూ.19 లక్షల విలువైన 49 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ శనివారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. లస్మక్కపల్లిలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

డబుల్ బెడ్‌రూం ఇళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, కౌశిక్‌రెడ్డి అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని ప్రణవ్ సూచించారు. అలాగే సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడం బీజేపీ రాజకీయ కుట్ర అని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

Generate ePaper Clip

Mohammad Anwar Babu
News Presented By:

Mohammad Anwar Babu

Senior Reporter