హైదరాబాద్,వి90న్యూస్,సెప్టెంబర్ 24: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన నేరెళ్ల శారద ని హైదరాబాద్‌లోని బుద్ధ భవన్‌లో హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ప్రణవ్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శారద కి ఆయన శాలువా కప్పి, పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా సాధికారత, వారి హక్కుల పరిరక్షణ దిశగా కమిషన్ మరింత వేగంగా పనిచేస్తుందని, ఈ పదవిలో నేరెళ్ల శారద విజయవంతంగా కొనసాగాలని ప్రణవ్ బాబు ఆకాంక్షించారు.ఈ వేడుకలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మోలుగూరి సదయ్య, జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి సజ్జు, అలాగే యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి తేలుకుంట్ల సన్నీతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని చైర్‌పర్సన్‌కు అభినందనలు తెలిపారు.

