కరీంనగర్ · September 1, 2026

కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోంది: ఎస్సీ మోర్చా నాయకుడు రాజేష్ ఠాకూర్ ఆగ్రహం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 01: తెలంగాణ బీజేపీ భవన్ ముందు కాంగ్రెస్ నాయకులు వ్యవహరించిన తీరును, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అక్రమ అరెస్టును బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్ ఠాకూర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని, ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల హక్కులను కాలరాయడం కాంగ్రెస్ ప్రభుత్వ అసహన వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.రామచందర్ రావు అరెస్టు ద్వారా పార్టీ పోరాటాలను ఆపలేరని, ఒక నాయకుడిని అరెస్టు చేస్తే వందలాది మంది కార్యకర్తలు ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. నల్లగొండ ఘటనలపై న్యాయం కోసం పోరాడుతున్న నాయకులను అడ్డుకోవడం కాంగ్రెస్ నియంతృత్వ ధోరణికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. అక్రమ అరెస్టులకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ చేపడుతున్న ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించే వరకు తమ పోరాటం ఆగదని, రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor
ట్యాగులు: