తెలంగాణ · September 23, 2026

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీ తెలంగాణ భవన్ నిర్మాణాలు: సీఎంతో ఉన్నతస్థాయి సమీక్ష

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్,వి90న్యూస్,సెప్టెంబర్ 23: ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యాల‌తో పాటు ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణాలు రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలకు ప్ర‌తీక‌లుగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

తెలంగాణ చ‌రిత్ర‌, సాంస్కృతిక ప్ర‌తిరూపాలైన కాక‌తీయ క‌ళాతోర‌ణం, రామ‌ప్ప ఆల‌యం, పిల్ల‌ల‌మ‌ర్రి దేవాల‌యాల శిల్ప‌, వాస్తు క‌ళల విశిష్టత ప్ర‌తిబింబించేలా ఈ ఆకృతులను తీర్చిదిద్దాలని సూచించారు. సమావేశంలో భాగంగా ప్రదర్శించిన పలు డిజైన్లను పరిశీలించిన సీఎం, తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేసేలా కొన్ని మార్పులు సూచించారు.విమానాశ్రయాల నిర్మాణ ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ లైన్లు, వాగుల ప్రవాహాలు, రహదారులు, బీఎస్ఎన్ఎల్ లైన్లు , తాగునీటి సరఫరా మార్గాల మార్పిడిపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను నివారించేందుకు విద్యుత్‌, ఆర్‌ అండ్ బీ, నీటి పారుద‌ల, తాగునీటి సరఫరా మరియు బీఎస్ఎన్ఎల్ శాఖల అధికారులు ఏకకాలంలో సమన్వయంతో సమావేశమై ప్రణాళికాబద్ధంగా పనులు సాగించాలని ఆదేశించారు.

వాగుల ప్రవాహాలను మళ్లించాల్సి వస్తే, విమానాశ్రయ ప్రాంగణం లేదా సమీపంలో చెరువులు నిర్మించి నీటిని మళ్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళికలతో పనులు పూర్తి చేయాలని సీఎంలో స్పష్టం చేశారు. విమానాశ్రయ కాంపౌండ్ వాల్ సమీపం నుంచి విశాలమైన రహదారులను నిర్మించి, వాటిని సమీపంలోని జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారులకు సులభంగా అనుసంధానించాలని సూచించారు. నిర్దేశిత సమయానికే పనులన్నీ పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, ఎంపీలు వేం నరేంద‌ర్ రెడ్డి, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, విప్ బీర్ల ఐల‌య్య‌, ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు , పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor