కరీంనగర్ · November 24, 2026

బీజేపీ ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/వి90 న్యూస్/నవంబర్ 24: భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్ మంగళవారం ప్రకటించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ సూచనల మేరకు ఈ నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేయాలనే సంకల్పంతో, బీసీల ఐక్యత , పార్టీ పటిష్టత కోసం నూతన కమిటీ సభ్యులు కృషి చేయాలని ఆకుల రాజేందర్ ఈ సందర్భంగా సూచించారు.నూతన కార్యవర్గంలో జిల్లా ఉపాధ్యక్షులుగా మియ్యపురం లక్ష్మణాచారి, వంగల రవిగోపాల్, ఎర్రోజు లక్ష్మణ్, జక్కుల శంకర్, నరాల రాజశేఖర్, కొయ్యడ అశోక్ యాదవ్ నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా కడార్ల రతన్ కుమార్, గర్దాస్ సతీష్, కొక్కర్ల మల్లేష్ యాదవ్; కార్యదర్శులుగా మచికట్ల మల్లేష్, ముత్యాల రవీందర్, బత్తిని మహేష్, బత్తిని స్వామి గౌడ్, వొడ్నాల చంద్రిక, పెరూరి అశ్విని; కోశాధికారిగా ఎర్రోజు రఘు బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే మీడియా సెల్ కన్వీనర్లుగా ఇంగ్లె ప్రభాకర్, సారంపల్లి రాజు; మన్ కీ బాత్ కన్వీనర్లుగా కొత్తకొండ దీపక్, బండారి శ్రీనివాస్; లాభార్థి ప్రముఖ్‌గా అటికం రాంచంద్రం ఎన్నికయ్యారు. వీరితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులుగా పొనగంటి రవికుమార్, చిందం ఆంజనేయులు, పండారి కొమురయ్య గౌడ్, నడికూడ కుమార్, బాగోజి గంగాధరాచారి, మండల సాయిబాబా యాదవ్, దాసరి రవి, సమ్మిల్ల విజేందర్, రాపెల్లి శ్రీనివాస్, గుర్రం సురేష్ గౌడ్ తదితరులను నియమించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor