కరీంనగర్ · November 23, 2026

ఆశా వర్కర్లకు రూ. 18,000 ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించాలి: సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/హుజురాబాద్/వి90 న్యూస్/నవంబర్ 23: హుజూరాబాద్‌లోని సీఐటీయూ మండల కార్యాలయంలో సోమవారం ఆశా వర్కర్స్ యూనియన్ మండల జనరల్ బాడీ సమావేశం తాడూరి లత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు రూ. 18,000 ఫిక్స్‌డ్ వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి ఆశాల సమస్యలను పరిష్కరించకపోతే 2026 డిసెంబర్ 15 నుండి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సమ్మెను నివారించేందుకు ప్రభుత్వం తక్షణమే యూనియన్ రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని, లేనిపక్షంలో తలెత్తే పరిణామాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 వేల మంది ఆశా వర్కర్లు గత 20 ఏళ్లుగా బడుగు, బలహీన వర్గాలకు విశేష సేవలందిస్తున్నారని కొప్పుల శంకర్ పేర్కొన్నారు. మాతాశిశు మరణాలను తగ్గించడం, సీజనల్ , అంటువ్యాధుల నియంత్రణ, కరోనా మహమ్మారి కట్టడిలో కీలక పాత్ర పోషించిన ఆశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం ‘గ్లోబల్ లీడర్స్’గా గుర్తించిందని గుర్తు చేశారు. ఉదయం నుండి రాత్రి వరకు సబ్ సెంటర్ డ్యూటీలు, ఆన్‌లైన్ సర్వేలు, పల్స్ పోలియో, డ్రై డే వంటి అనేక పనులు చేస్తున్నప్పటికీ నేటికీ ఫిక్స్‌డ్ వేతనం లేకపోవడం అన్యాయమన్నారు. గత ఐదేళ్లుగా పారితోషికం పెరగకపోవడంతో, ప్రస్తుతం ఇస్తున్న రూ. 9,900 ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరల ముందు ఏమాత్రం సరిపోక ఆశాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు విమల, శారద, అన్నపూర్ణ, సునీత, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor