ఆంధ్ర ప్రదేశ్ · November 23, 2026

కృష్ణా జలాల విడుదలపై నేడు KRMB త్రిసభ్య కమిటీ కీలక భేటీ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

అమరావతి/వి90 న్యూస్/నవంబర్ 23: కృష్ణా నదీ జలాల వినియోగం , రాబోయే రోజుల్లో నీటి విడుదల అంశాలపై చర్చించేందుకు నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ అత్యవసరంగా సమావేశం కానుంది. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొనే ఈ భేటీలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలపై కమిటీ కూలంకషంగా చర్చించనుంది. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే తదుపరి మూడు నెలల కాలానికి గాను తమ రాష్ట్రానికి అవసరమైన నీటిని విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే బోర్డుకు అధికారికంగా విజ్ఞప్తి చేసింది.ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలు, తాగునీరు , సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ చేసిన ఈ ప్రతిపాదనపై కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు. దీనితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వాటాల ఖరారు అంశం కూడా నేటి సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల విషయంలో స్పష్టత తీసుకురావడంతో పాటు, తక్షణ అవసరాల కోసం నీటి విడుదలపై త్రిసభ్య కమిటీ నేడు తుది నిర్ణయం తీసుకోనుంది.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor
ట్యాగులు: