తెలంగాణ · November 23, 2026

మామునూర్ పోలీస్ స్టేషన్‌లో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ వార్షిక తనిఖీ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

వరంగల్/వి90 న్యూస్/నవంబర్ 23: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మామునూర్ పోలీస్ స్టేషన్‌ను ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, ఐపీఎస్ సోమవారం సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు. స్టేషన్‌కు చేరుకున్న డీసీపీకి పోలీస్ అధికారులు పూల మొక్క అందించి స్వాగతం పలకగా, సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.

తనిఖీలో భాగంగా స్టేషన్‌లోని వివిధ రికార్డులు, రిజిస్టర్లు, పెండింగ్ కేసుల వివరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడి వారి విధులు, పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.

ముఖ్యంగా యువత గంజాయి వంటి మత్తుపదార్థాలకు బానిసలు కాకుండా నిరంతరం నిఘా ఉంచాలని, వాటి విక్రయం, వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని మామునూర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌కు సూచించారు.

ఈ కార్యక్రమంలో మామునూర్ ఏసీపీ వెంకటేష్, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్‌ఐలు నిసార్ పాషా, హరిశంకర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor