కరీంనగర్/ఇల్లందకుంట/వి90 న్యూస్/నవంబర్ 23: సిరిసేడు గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నక్క కృష్ణ అనారోగ్యంతో మరణించడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో గ్రామపంచాయతీ తరఫున రూ.20,000 ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. సర్పంచ్ రేనుకుంట్ల శ్యామల కుమార్, ఉప సర్పంచ్ వంశీ, వార్డు సభ్యులు , పాలకవర్గ సభ్యులు కలిసి ఈ సహాయాన్ని అందించారు.

కుటుంబాన్ని కోల్పోయిన బాధను ఎవరూ భర్తీ చేయలేకపోయినా, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాసటగా నిలవడం అందరి బాధ్యత అని వారు పేర్కొన్నారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. కష్టాల్లో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించడమే నిజమైన మానవత్వమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

