కరీంనగర్ · November 23, 2026

శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట/వి90 న్యూస్/నవంబర్ 23: జమ్మికుంట పట్టణంలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ ప్రజలందరికీ శ్రీ సత్యసాయి బాబా దైవాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. తాము కౌన్సిలర్లుగా, చైర్మన్‌గా పదవుల్లో ఉండి ప్రజలకు మంచి పనులు చేయగలుగుతున్నామంటే అది కేవలం దైవానుగ్రహం వల్లే సాధ్యమవుతోందని పేర్కొన్నారు.

సేవా సమితి సభ్యులు మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని సూచిస్తూ, వారితో పాటు తాను కూడా బాధ్యతాయుతంగా సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతానని తెలిపారు. స్వామివారి 101వ జయంతి వేడుకల్లో పాలుపంచుకోవడం తన అదృష్టమని, సత్యసాయి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor