కరీంనగర్/జమ్మికుంట/వి90 న్యూస్/నవంబర్ 23: జమ్మికుంట పట్టణంలోని 12వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ నమోదు కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ పరిధిలో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం ఈ పథకంలో తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని, అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. బీమా నమోదు కోసం కేవలం రేషన్ కార్డు , ఫోన్ నంబర్ వివరాలు సరిపోతాయని స్పష్టం చేస్తూ, ప్రజలు తమ తమ వార్డులలోని వార్డ్ ఆఫీసర్లను సంప్రదించి నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ చుంచు రమాదేవి, చుంచు శివ, విజయ తదితరులు పాల్గొన్నారు.

