ఆంధ్ర ప్రదేశ్ · October 13, 2026

ఏపీ సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ: సాదర స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

అమరావతి/వి90 న్యూస్/అక్టోబర్ 13: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ప్రతిష్టాత్మక సమావేశం నిర్వహించారు. అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసానికి విచ్చేసిన తమిళనాడు సీఎం విజయ్‌కు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర ఐటీ, ఐటీఈసీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎంతో ఆత్మీయంగా, సాదర స్వాగతం పలికారు.

ఈ మర్యాదపూర్వక సమావేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడుతో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు పరిచయం చేశారు.

అనంతరం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య పరస్పర సంబంధాలు, ఇరు రాష్ట్రాల అభివృద్ధి, పలు కీలక ప్రాంతీయ అంశాలపై కాసేపు ఆత్మీయ చర్చలు జరిగినట్లు సమాచారం.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor