కరీంనగర్ · November 19, 2026

ఘనంగా ఇందిరమ్మ జయంతి వేడుకలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/ఇల్లందకుంట/వి90 న్యూస్/ నవంబర్ 19: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి, దేశ ఐక్యత, సమగ్రత కోసం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చేసిన సేవలు మరువలేనివని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు. గురువారం ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా గాంధీ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి కొత్తగా 4,336 పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. సిద్దిపేట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఇందిరమ్మ జీవిత బీమా’ పథకాన్ని ప్రారంభించడంతో పాటు, ఇందిరమ్మ చీరల పంపిణీ, నూతన పెన్షన్ లబ్ధిదారులకు నిధుల విడుదల కార్యక్రమాలను చేపట్టనున్నారని వివరించారు. సిద్దిపేట బహిరంగ సభకు నియోజకవర్గం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో తరలివెళ్తున్నారని పేర్కొన్నారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, పేద ప్రజలకు అండగా నిలుస్తోందని ప్రణవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor