తెలంగాణ · November 19, 2026

సాగు బాగుంటేనే సుభిక్ష తెలంగాణ.. సీఎం రేవంత్ రెడ్డి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

హైదరాబాద్/వి90న్యూస్/నవంబర్ 19: సాగు బాగుంటేనే సుభిక్షమైన తెలంగాణ సాధ్యమవుతుందని, ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం తన నివాసంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో బహుముఖ సేవలు అందించిన ప్రముఖులకు ముఖ్యమంత్రి ‘ఇందిరా గాంధీ కృషి రత్న’ పురస్కారాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో వ్యవసాయ రంగానికి విశేష సేవలు అందించిన శాస్త్రవేత్తలు, పాత్రికేయులు, రైతులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. ఈ మేరకు వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం. సుగుణాకర్ రెడ్డి, డాక్టర్ ఎస్.డి. శిఖామణి, పాత్రికేయుడు ఆర్. దిలీప్ రెడ్డి, గిరిజన రైతు లోనావత్ శాంతా బాయి, సేంద్రియ రైతు కె. లావణ్యలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా పురస్కారాలను అందుకున్నారు.

ఈ సందర్భంగా ప్రధానిగా ఇందిరా గాంధీ వ్యవసాయాభివృద్ధికి అందించిన చేయూత, ఆ కాలంలో సాగు రంగంలో చోటుచేసుకున్న అభివృద్ధిపై రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ రూపొందించిన పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర రైతు కమిషన్ ఛైర్మన్ ఎం. కోదండ రెడ్డి, కమిషన్ సభ్యులు కె.వి.ఎన్. రెడ్డి, ఎం. భవాని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor