కరీంనగర్/జమ్మికుంట/వి90 న్యూస్/నవంబర్ 19: పట్టణ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను స్థానికంగానే అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా జమ్మికుంటలో డాక్టర్ బి. రమేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రిషిక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ఆసుపత్రిని ప్రారంభించారు.ఈ సందర్భంగా హనుమకొండలోని కూరపాటి ఆసుపత్రికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కూరపాటి రమేష్ ఆధ్వర్యంలో అడ్వాన్స్‌డ్ లాప్రోస్కోపీ, లేజర్ సర్జరీ వైద్య సేవలను కూడా ప్రారంభించారు.

ఇకపై ప్రతి మంగళవారం డాక్టర్ కూరపాటి రమేష్ జమ్మికుంటలోని ఈ ఆసుపత్రిలో అందుబాటులో ఉండి రోగులకు వైద్య సేవలు అందించనున్నారు.అనంతరం మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) మాట్లాడుతూ.. జమ్మికుంట పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు నాణ్యమైన, ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడం ఎంతో సంతోషకరమన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ముందుకొచ్చిన ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మాచర్ల రాజు, ఆసుపత్రి నిర్వాహకులు, వైద్యులు, సిబ్బంది, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

