జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు హాజరుసొంతింటి కల నెరవేరిందని లబ్ధిదారుల హర్షం
కరీంనగర్/ఇల్లందకుంట/వి90 న్యూస్/నవంబర్ 20: పేదల సొంతింటి కలను నిజం చేస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శుక్రవారం జమ్మికుంట మున్సిపల్ పరిధితో పాటు ఇల్లందకుంట మండల కేంద్రం, లక్ష్మాజిపల్లి గ్రామాల్లో పలువురు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు, నూతన ఇంటి నిర్మాణ ముగ్గుపోసే కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

నూతన గృహాల్లోకి అడుగుపెడుతున్న వేళ లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రణవ్ సహకారంతో నెరవేర్చుకున్నామని వారు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, స్థానిక సర్పంచులు, జమ్మికుంట పట్టణ, ఇల్లందకుంట మండల కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

