సరస్వతి శిశు మందిర్ అదనపు తరగతి గదులను ప్రారంభించిన లింగం సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్
కరీంనగర్/జమ్మికుంట/వి90 న్యూస్/నవంబర్ 20: విద్య ద్వారానే సమగ్ర వికాసం సాధ్యమవుతుందని, విలువలతో కూడిన విద్యను అందిస్తూ విద్యా భారతి సంస్థలు ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తున్నాయని విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం జమ్మికుంట పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్‌తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన నూతన గదులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా లింగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన మన దేశంలో విలువలతో కూడిన విద్యను అందిస్తున్న ఏకైక సంస్థలు విద్యా భారతి, సరస్వతి శిశు మందిర్ పాఠశాలలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలాంటి పాఠశాలల్లో చేర్పించి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాలని, పాఠశాలల అభివృద్ధికి ఆదరణ కల్పించాలని కోరారు. పాఠశాల సమితులు, ప్రబంధకారిణి సభ్యుల కృషితో తరగతి గదులతో పాటు గ్రంథాలయాలు, కంప్యూటర్లు, సైన్స్ ల్యాబ్, చిల్డ్రన్ పార్క్ వంటి మౌలిక వసతులు సమకూరుతున్నాయని తెలిపారు. ఒకప్పుడు తెలుగు మీడియంలో సీట్ల కోసం సిఫార్సులు వచ్చేవని, మారుతున్న కాలానికి అనుగుణంగా జాతీయ విద్యా విధానాన్ని అనుసరిస్తూ ఇంగ్లీష్ మీడియంలోనూ అత్యుత్తమ బోధన అందిస్తున్నామని వివరించారు. ఇక్కడ చదువుకున్న ఎందరో విద్యార్థులు నేడు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో స్థిరపడి ఉన్నత స్థాయిలో రాణిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మంతెన హేమలత, ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యవాహ పాక సత్యనారాయణ, శ్రీ సరస్వతి విద్యాపీఠం అధ్యక్షులు ముక్కాల సీతారాములు, పూర్వ విద్యార్థి సినీ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జావేద్, జిల్లా కార్యదర్శి తెల్ల రాజమౌళి, పూర్వ ప్రబంధకారిణి అధ్యక్షులు డాక్టర్ చిట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సమితి అధ్యక్ష కార్యదర్శులు ఆవాల రాజారెడ్డి, ఆకుల రాజేందర్, ప్రబంధకారిణి అధ్యక్ష కార్యదర్శులు శీలం శ్రీనివాస్, దాస రవీందర్ పాల్గొన్నారు. వీరితో పాటు బుర్ర శివయ్య, కేతిపల్లి మాధవరెడ్డి, పాకాల రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు ఒగ్గు రమేష్, దిండి కోమల (రాము), రావికంటి నీలకంఠం, ముంగటి ప్రకాష్ రెడ్డి, ఎక్కడి రఘోత్తమ్ రెడ్డి, చిగురాల భాస్కర్, నల్ల దేవేందర్ రెడ్డి, కెవిడె కుమార్, రాజ్ కుమార్, ప్రధానాచార్యులు గుడికందుల సుదర్శన్, ఆచార్యులు, విద్యాభిమానులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

