కరీంనగర్ · November 20, 2026

సిరిసేడులో లబ్ధిదారులకు ఇందిరమ్మ బీమా పత్రాలు, రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ రేనుకుంట్ల శ్యామల కుమార్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/ఇల్లందకుంట/వి90 న్యూస్/నవంబర్ 20 : ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలని సిరిసేడు గ్రామ సర్పంచ్ రేనుకుంట్ల శ్యామల కుమార్ అన్నారు. శుక్రవారం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా ఇందిరమ్మ బీమా పథకం పత్రాలు, నూతన రేషన్ కార్డులు, చేయూత ఆసరా పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన కుటుంబానికి చేరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజా సేవే తమ బాధ్యత అని, గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసేడు గ్రామ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor