ఆంధ్ర ప్రదేశ్ · September 24, 2026

నకిలీ ఐడీ కార్డులతో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో చోరీలు: 7 మంది ముఠా అరెస్ట్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

విశాఖపట్నం,వి90 న్యూస్,సెప్టెంబర్ 24: విశాఖ స్టీల్ ప్లాంట్‌లోకి ఫేక్ ఐడీ కార్డులతో అక్రమంగా ప్రవేశించి చోరీలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను గాజువాక క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, క్రైమ్ డీసీపీ లత మాధురిల ఆదేశాల మేరకు పోలీసులు ఈ ప్రక్రియను చేపట్టారు. స్టీల్ ప్లాంట్ అసలు ఉద్యోగుల ఐడీ కార్డులను మార్ఫింగ్ చేసి, నకిలీ సీఐఎస్ఎఫ్ (CISF) స్టాంపులను ఉపయోగించి ఫేక్ కార్డులు తయారు చేసినట్లు విచారణలో తేలింది.

ఈ నకిలీ కార్డుల సాయంతో ప్లాంట్‌లోకి ప్రవేశించి నిందితులు పెద్ద ఎత్తున రాగి, స్టీల్‌ సామగ్రిని దొంగిలించేవారు.ఈ దాడిలో అరెస్ట్ అయిన వారిని పైడిపాటి వెంకట భార్గవ్, పోతిన శ్రీకాంత్, ఇసుకుపల్లి నాగేంద్ర వర్మ, గర్తియా రవిశంకర్, బంగారు సతీష్ కుమార్, ఇసుకుపల్లి వంశీ, నవాబు యువరాజుగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి సుమారు 300 కేజీల రాగి, 5 నకిలీ ఐడీ కార్డులు, రెండు బైకులను పోలీసులు స్వాధినం చేసుకున్నారు. అత్యంత భద్రత ఉండే కీలకమైన పారిశ్రామిక సంస్థలోకి నకిలీ ఐడీలతో వీరు ఎలా ప్రవేశించారనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor