ఆంధ్ర ప్రదేశ్ · September 28, 2026

విజయవాడలో వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు: అక్టోబర్ 11 నుంచి ప్రత్యేక ఆకర్షణలతో విజయవాడ ఉత్సవ్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

విజయవాడ,వి90 న్యూస్,సెప్టెంబర్ 28: విజయవాడలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు విజయవాడ ఉత్సవ్ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ ఉత్సవాలను పున్నమి ఘాట్, ఎం.బి.కె. స్టేడియం వేదికలుగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 8 నుండి 23 వరకు జాతీయ స్థాయి సరస్సు మేళా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పది రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో పసందైన వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ తో పాటు వివిధ రాష్ట్రాల సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా కళాకారుల ప్రదర్శనలు అలరించనున్నాయి. అలాగే పండుగ వాతావరణాన్ని మరింత రెట్టింపు చేసేందుకు మైసూర్ ఏనుగుల ప్రదర్శనను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నారు. మరోవైపు ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం నవరాత్రుల సమయంలో ఉచిత దర్శన ఏర్పాట్లను విస్తృతంగా చేపట్టారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor