జనగామ · November 11, 2026

కార్తీక పౌర్ణమి ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జనగాం/పాలకుర్తి/వి90 న్యూస్/నవంబర్ 11: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించనున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల ఉత్సవ పోస్టర్‌ను స్థానిక శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ధార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఎంతో విశిష్టమైన ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యత కలిగినదని తెలిపారు. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో దీపారాధన, శివారాధన, విష్ణు ఆరాధనతో పాటు గిరి ప్రదక్షిణలకు విశేష ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో నిర్వహించే గిరి ప్రదక్షిణ, అఖండ జ్యోతి దర్శనం, లక్షదీపోత్సవం వంటి కార్యక్రమాలు భక్తులకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయని అన్నారు. ఈ పవిత్ర వేడుకల్లో పాలకుర్తి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని, పూజల్లో పాల్గొని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దివ్య ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు. పాలకుర్తి పుణ్యక్షేత్ర మహిమను చాటిచెప్పేలా ఈ ధార్మిక కార్యక్రమాలను శోభాయమానంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.కార్తీక పౌర్ణమి ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు, సంబంధిత ప్రభుత్వ అధికారులు పూర్తయిన సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్వామివారి కృపాకటాక్షాలతో నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, పాలకుర్తి ప్రాంతం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor