కరీంనగర్ · November 24, 2026

పింఛన్లపై తప్పుడు ప్రచారం తగదు.. కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట/వి90 న్యూస్/నవంబర్ 24: కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న పింఛన్లను గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినవిగా ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కౌశిక్ రెడ్డి ప్రయత్నించడం సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్‌లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ ప్రచార కమిటీ సభ్యుడు సాయిని రవి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అర్హులైన పేదలకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తోందని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఇంటికి ప్రమాద బీమా పథకాన్ని అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేయడం తగదని అన్నారు. ప్రజలకు ఎవరు సంక్షేమ పథకాలు అందిస్తున్నారో స్పష్టంగా తెలుసని, వాస్తవాలను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం మానుకోవాలని కౌశిక్ రెడ్డికి హితవు పలికారు. సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం మానుకోవాలని వారు హెచ్చరించారు.ఈ సమావేశంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వీరమనేని పరశురామారావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దొగ్గల భాస్కర్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి దొడ్డే శ్రీకాంత్, మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఒగ్గు రమేష్, పొన్నగంటి విష్ణు, ఎగిత అశోక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గడ్డం దీక్షిత్, మానుపాటి సూర్య, పొనగంటి మధు, పూరెల్ల రాకేష్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సలీం, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు రాచపల్లి సాగర్, పర్లపల్లి నాగరాజు, సజ్జు, పంజాల అజయ్, పాత ప్రసాద్, యాదవ సంఘం మండల అధ్యక్షుడు గిరవేన శ్రీనివాస్, కొలుగురు రవి, తిరుపతి రెడ్డి, వేల్పుల ప్రశాంత్, గుల్లి జెఫనియా, టింకరాల కిషోర్, రాకేష్, గుర్రపు ప్రవీణ్, రాసపెల్ అశ్విన్, కొలుగురి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor