కరీంనగర్ · September 22, 2026

నాయిని చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, సెప్టెంబర్ 22: నవరాత్రోత్సవాల సందర్భంగా అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలందుకున్న విఘ్నేశ్వర స్వామి వారి విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి జమ్మికుంట నాయిని చెరువు వద్ద చేపట్టిన ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొమ్మిది రోజుల పాటు భక్తులు ఏ విధంగానైతే నిష్టతో, ఆధ్యాత్మిక ఉత్సాహంతో గణనాథుడిని పూజించుకున్నారో, అదే రీతిలో నిమజ్జన మహోత్సవాన్ని కూడా అత్యంత సంతోషకరమైన, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

భక్తులందరూ సమయానుకూలంగా బయలుదేరి ప్రశాంతంగా దర్శనాలు పూర్తి చేసుకుంటూ, నిమజ్జన ప్రక్రియను ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు, ఉత్సవ కమిటీ సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, కౌన్సిలర్లు పొనగంటి విష్ణు, పోనగంటి రాము, సీఐ రామకృష్ణ, ఏఈ వికాస్, శ్రీనులతో పాటు పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor