కరీంనగర్ · October 6, 2026

ఆబాది జమ్మికుంటలో వైభవంగా హైమాస్ట్ లైట్ నిర్మాణానికి భూమి పూజ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, అక్టోబర్ 06: ఆబాది జమ్మికుంటలోని 14వ వార్డులో ప్రజల సౌకర్యార్థం నూతనంగా ఏర్పాటు చేయనున్న హైమాస్ట్ లైట్ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) శంకుస్థాపన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ పాలకవర్గం ఏర్పడిన నాటి నుండి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, పట్టణాభివృద్ధే ధ్యేయంగా, ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. వార్డుల వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామని, రాబోయే రోజుల్లో పట్టణాన్ని మరిన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మైస శిరీష రవి, మాజీ కౌన్సిలర్ దయ్యాల శ్రీనివాస్లతో పాటు వార్డు నాయకులు జక్కే రవీందర్, పొడేటి అనిల్, పంజాల అనీల్, సాంబయ్య, స్వామి, శ్రీనివాస్, చిరంజీవి, రాజు, మొగిలి, రవి , స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor