తెలంగాణ · October 5, 2026

వేములవాడ ఆలయ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

రాజన్న సిరిసిల్ల,వి90 న్యూస్,అక్టోబర్ 05: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సమీక్షలో భాగంగా ఆలయంలో ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని శాఖల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పూర్తయిన పనుల స్థితిగతులను పరిశీలించిన మంత్రి, పెండింగ్‌లో ఉన్న పనులను ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వేములవాడ దేవస్థాన అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

అభివృద్ధి పనుల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటించడంతో పాటు, పనుల్లో వేగం పెంచాలని , వివిధ శాఖల అధికారులు ఒకరికొకరు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, నిర్దేశిత గడువులోగా అన్ని నిర్మాణాలను పూర్తి చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor