తెలంగాణ · October 5, 2026

శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు: సోమవారం ఘనంగా కోడె మొక్కులు, విశేష పూజలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

రాజన్న సిరిసిల్ల/వేములవాడ,వి90 న్యూస్, అక్టోబర్ 05: వేములవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు దర్శనం కోసం ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి భక్తిశ్రద్ధలతో కోడె మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం ఆకుల పూజ, అన్నపూజ, అభిషేకాలు నిర్వహించి తమ ఇష్టదైవానికి నిత్య పూజలతో పాటు ప్రత్యేక పూజలు సమర్పించారు. భక్తుల తాకిడి పెరగడంతో ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మార్మోగింది. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor