జయశంకర్ భూపాలపల్లి,వి90 న్యూస్, అక్టోబర్ 05: జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలి అయిన అంబేద్కర్ సెంటర్‌ను రూ.20 కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక హంగులతో అభివృద్ధి చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ కూడలిలో నిత్యం ఎదురవుతున్న తీవ్ర ట్రాఫిక్ రద్దీ, రోడ్ల దుస్థితి మరియు పార్కింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్‌కు రూపకల్పన చేశారు. పట్టణానికి గుండెకాయ లాంటి ఈ సెంటర్‌ను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు, ప్రజలకు సకల రవాణా సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చేలా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పనులు పూర్తయితే అంబేద్కర్ సెంటర్ రూపురేఖలు పూర్తిగా మారిపోవడమే కాకుండా భూపాలపల్లి పట్టణ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.

