రంగారెడ్డి,వి90 న్యూస్,అక్టోబర్ 05: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (ఆవోపా) రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొడ్డు శ్రీధర్ కోరారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడంతో పాటు సామాజిక బాధ్యతను నెరవేర్చడంలో ప్రతి ఓటూ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. పట్టభద్రులకు ఓటు నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు ఆవోపా ఆధ్వర్యంలో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓటు నమోదు చేసుకోవాలనుకునే వారు తమ ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు , డిగ్రీ సర్టిఫికేట్ జిరాక్స్ ప్రతులతో సహాయ కేంద్రాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. పూర్తి వివరాలు సహాయం కోసం 9552567224, 9121980792, 9890041486 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని బొడ్డు శ్రీధర్ విజ్ఞప్తి చేశారు.

