కరీంనగర్ · November 22, 2026

ప్రజాస్వామ్య పరిరక్షణకు కరీంనగర్‌లో రేపు బీజేపీ పాదయాత్ర.. విజయవంతం చేయాలని ఓబీసీ మోర్చా పిలుపు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/వి90 న్యూస్/నవంబర్ 22: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ నగరంలో భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా హాజరై, ఆయన ఆధ్వర్యంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఈ పాదయాత్ర ప్రారంభం కానుందని ఆయన పేర్కొన్నారు.ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పార్టీ జాతీయ నాయకత్వం తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జిల్లాలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఓబీసీ మోర్చా శ్రేణులు , అనుబంధ విభాగాల బాధ్యులు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కరీంనగర్ ప్రజలు, మేధావులు, యువత స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ పాదయాత్రకు మద్దతు తెలపాలని, ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని ఆకుల రాజేందర్ పిలుపునిచ్చారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor