కరీంనగర్ · October 8, 2026

జమ్మికుంటలో నగదు, వెండితో భార్య అదృశ్యం: బాధితుడి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్, అక్టోబర్ 06: జమ్మికుంట పట్టణ కేంద్రంలో ఓ వివాహిత ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లిపోయిన సంఘటన కలకలం రేపింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… జమ్మికుంట కు చెందిన రేవెల్లి తిరుపతి కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు.ఈ క్రమంలో అక్టోబర్ 6వ తేదీ మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో తిరుపతి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో, ఆయన భార్య రేవెల్లి దేవిక అలియాస్ రాణి (28) ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. వెళ్లే సమయంలో ఇంట్లోని అల్మారాలో దాచి ఉంచిన రూ. 2,000 నగదుతో పాటు 3 తులాల వెండి ఆభరణాలు , తన దుస్తులను కూడా వెంట తీసుకెళ్లింది. కొద్దిసేపటి తర్వాత నిద్రలేచిన తిరుపతికి భార్య ఇంట్లో కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయన చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువులు , తెలిసిన వారి ఇళ్లలో ఎంత వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో చివరకు పోలీసులను ఆశ్రయించిన తిరుపతి తన భార్య అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జమ్మికుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని, మహిళ అదృశ్యంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor