తెలంగాణ · June 18, 2026

వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో భారీగా ఎస్ఐల బదిలీలు: తొమ్మిది మంది మహిళా అధికారులకు స్థానచలనం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

వరంగల్,వి90 న్యూస్,జూన్ 18: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్ద ఎత్తున సబ్ ఇన్స్పెక్టర్ల (ఎస్ఐ) బదిలీలు జరిగాయి. కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లతో పాటు పలు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న 23 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, పరిపాలనా పరమైన కారణాలతో ఈ బదిలీలు చేపట్టినట్లు తెలుస్తోంది. కాగా, ఈ బదిలీల జాబితాలో మొత్తం తొమ్మిది మంది మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు ఉండటం గమనార్హం. ఉత్తర్వులు అందుకున్న అధికారులు తక్షణమే తమకు కేటాయించిన కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని కమిషనర్ ఆదేశించారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor