జమ్మికుంట నూతన తహసీల్దార్ సుధాకర్‌కు మున్సిపల్ కమిషనర్ మర్యాదపూర్వక సన్మానం
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 08: జమ్మికుంట తహసీల్దార్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సుధాకర్‌ను మున్సిపల్ కమిషనర్ జి. మల్లికార్జున స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ ముఖాముఖి భేటీలో కమిషనర్ మాట్లాడుతూ, నూతన బాధ్యతల్లో తహసీల్దార్ సుధాకర్ విజయవంతంగా రాణించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి, పట్టణాభివృద్ధికి మున్సిపాలిటీ మరియు రెవెన్యూ శాఖలు పూర్తి సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి. రాజిరెడ్డి, ఆర్ ఐ భాస్కర్, శ్రీనివాస్ , మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొని నూతన తహసీల్దార్‌కు తమ అభినందనలు తెలిపారు.

