జమ్మికుంటలో ‘సిర్’ (SIR) ఫామ్‌లపై అవగాహన: ఎవరూ ఆందోళన చెందొద్దన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 09 : ఆబాది జమ్మికుంట పరిధిలోని ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సిర్’ (SIR) ఫామ్‌ల ప్రక్రియపై మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) గురువారం సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఫామ్‌ల విషయంలో ప్రజలెవరూ ఎలాంటి ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

2002 సంవత్సరంలో తమ ఓటు హక్కు ఎక్కడ ఉందో ఆ వివరాలను ఫామ్‌లో నమోదు చేయాలని, ఒకవేళ ఆ సమయంలో ఓటు లేని వారు ఉంటే వారి తల్లిదండ్రులలో ఎవరిదో ఒకరి వివరాలను పొందుపరచాలని సూచించారు. అలాగే కొత్తగా పెళ్ళైన వారు కూడా తమ తల్లిదండ్రుల వివరాలను రాయవచ్చని, అయితే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ సిర్ ఫామ్‌ను పూర్తి చేసి స్థానిక బీఎల్ఓ (BLO)లకు అందజేయాలని ఆయన కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, కౌన్సిలర్లు ఎగిత సుజాత అశోక్, మైస శిరీష రవిలతో పాటు ఆర్‌పీలు, బీఎల్ఓలు, ఆశా వర్కర్లు , వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

