కరీంనగర్ · July 9, 2026

మడిపల్లిలో మహిళా సంఘ భవన నిర్మాణానికి ఘనంగా భూమి పూజ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 09: జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో గురువారం మహిళా సంఘ భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ పసుల తిరుమల ఘనంగా భూమి పూజ చేశారు. ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) కింద మంజూరైన 10 లక్షల రూపాయల నిధులతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామీణ మహిళల సంక్షేమం మరియు వారి అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ భవన నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ భవనం అందుబాటులోకి వస్తే మహిళా సంఘాలు తమ రెగ్యులర్ సమావేశాలను, ఇతర సామాజిక కార్యక్రమాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకే చోట నిర్వహించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అంజిరెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనాథ్, వార్డు సభ్యులు సాయిరాం, రాణి, కమ్యూనిటీ అసిస్టెంట్లు (సీఏలు) పరమేశ్వరి, స్వప్నలతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor