కరీంనగర్ · July 13, 2026

జమ్మికుంటలో ఘనంగా నులిపురుగుల నివారణ మందుల పంపిణీ.. పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 13: జమ్మికుంట పట్టణ పరిధిలోని బాలుర పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు డి-వార్మింగ్ (నులిపురుగుల నివారణ) మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) హాజరై విద్యార్థులకు మందులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అనే తేడా లేకుండా ప్రతి విద్యార్థికి ఈ డి-వార్మింగ్ మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని పేర్కొన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు నులిపురుగుల నివారణ ఎంతో అవసరమని, కావున ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ మందులను వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మాచర్ల రాజు, మండల విద్యాధికారి (MEO), పాఠశాల ఉపాధ్యాయులు సురేష్, స్థానిక వైద్యురాలు చందన, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor