కరీంనగర్ · July 16, 2026

బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా సమావేశంలో రాజేష్ ఠాకూర్… పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 16: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిన్న అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో జమ్మికుంట టౌన్‌కు చెందిన బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు రాజేష్ ఠాకూర్ పాల్గొని, పార్టీ బలోపేతానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.సమావేశం ముగిసిన అనంతరం ఆయన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావును, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు క్రాంతి కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని పార్టీ కార్యకలాపాలు, క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజా సమస్యలు, సంస్థాగత బలోపేతం వంటి అంశాలను వారికి క్షుణ్ణంగా వివరించారు. రాజేష్ ఠాకూర్ అందించిన వివరాలపై స్పందించిన రాష్ట్ర నాయకత్వం, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించింది. అంతేకాకుండా, రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేసింది.ఈ సందర్భంగా రాజేష్ ఠాకూర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ , అభివృద్ధి పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా తాము శ్రమిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి మరిన్ని నిధులు, మౌలిక వసతుల ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలను తీసుకురావడంలో రాష్ట్ర పార్టీ నాయకత్వంతో పూర్తి సమన్వయంతో నిరంతరం పనిచేస్తామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బూత్ స్థాయి నుంచే పార్టీని పటిష్టం చేయడంతో పాటు యువత, మహిళలు, ఎస్సీ వర్గాల భాగస్వామ్యాన్ని పెద్ద ఎత్తున పెంచుతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడడమే తమ ప్రధాన లక్ష్యమని, పార్టీ పట్ల పూర్తి అంకితభావంతో పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తామని రాజేష్ ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor