హుజురాబాద్‌లో ఓటర్ల నమోదు ప్రక్రియపై వొడితల ప్రణవ్ జూమ్ కాల్ సమీక్ష

0
1006150407

కరీంనగర్/హుజూరాబాద్,వి90 న్యూస్, జూలై 19: హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో ఓటర్ల నమోదు ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ శనివారం కో ఆర్డినేటర్లు, బిఎల్ఏలతో ఒక ముఖ్యమైన జూమ్ కాల్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఓటు నమోదు ప్రక్రియ ఎలా సాగుతోందని అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. సీఎం స్వయంగా ఈ వివరాలు అడగడాన్ని బట్టి చూస్తే పార్టీ ఈ ప్రక్రియను ఎంత సీరియస్‌గా తీసుకుంటుందో కార్యకర్తలు అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు.నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చూడాలని, ఏ ఒక్క ఓటరు కూడా ఓటు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రణవ్ కోరారు. ఓటర్ల మ్యాపింగ్ , అన్ మ్యాపింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ సరిచూసుకోవాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ శ్రేణులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ఓటర్ల నమోదుకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదురైనా, వాటిని వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed