కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ చైర్మన్ సన్మానం

0
IMG-20260721-WA0043

కరీంనగర్/ఇల్లంతకుంట,వి90 న్యూస్,జూలై 21: ఇల్లంతకుంట మండల కేంద్రంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంను శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీపీతో కలిసి దేవస్థానం చైర్మన్ వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు గొడిశాల పరమేష్, ఎడ్ల కిషన్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు అమరేందర్ రెడ్డి, గుండారపు సాయి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed