5వ వార్డులో మిషన్ భగీరథ పైప్‌లైన్ వేయాలని మున్సిపల్ చైర్మన్‌కు వినతి

0
1006170957

కరీంనగర్/జమ్మికుంట,వి90న్యూస్,జూలై 21: జమ్మికుంట పట్టణ పరిధిలోని 5వ వార్డుకు చెందిన పలు నివాస గృహాలకు మిషన్ భగీరథ పైప్‌లైన్ సౌకర్యం కల్పించాలని కోరుతూ వార్డు ప్రజలు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్‌)ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వార్డులోని కొన్ని ఇళ్లకు ఇప్పటివరకు పైప్‌లైన్ వేయనందున తాగునీటి ఎద్దడి తలెత్తుతోందని, వెంటనే పైప్‌లైన్ నిర్మాణం చేపట్టి మంచినీటి సదుపాయం అందించాలని చైర్మన్‌ను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ పట్టణ పరిధిలోని కొత్తపల్లి ప్రాంతాలలో ‘అమృత్’ పథకం ద్వారా నీటి సరఫరా కోసం పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే 5వ వార్డులోని మిగిలిపోయిన నివాస గృహాలకు కూడా త్వరలోనే పైప్‌లైన్ వేసి మంచినీరు అందేలా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు వాసులు యాట్ల అవినాష్, కాళోజీ లక్ష్మణ్, రమేష్, సంజీవ్, శ్రీనివాస్, ప్రణీత తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed