మానసిక వికలాంగుల పాఠశాలలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు

0
IMG-20260722-WA0060

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 22: కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను బిఆర్ఎస్వి (BRSV) జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొమ్ము నరేష్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మారుతినగర్‌లో ఉన్న శ్రీ సత్యసాయి మానసిక వికలాంగుల పాఠశాలలో ఈ వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ విద్యార్థులతో కలిసి నిర్వాహకులు కేక్ కట్ చేశారు. అనంతరం చిన్నారులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేసి వారితో ఆప్యాయంగా సమయాన్ని గడిపారు.

ఈ సందర్భంగా కొమ్ము నరేష్, 8వ వార్డు కౌన్సిలర్ కొలుగూరి సురేష్, జవాజి అనిల్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి వినోద్ కుమార్ క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఎల్లప్పుడూ ప్రజాసేవకు, సామాజిక సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే ఆయన జన్మదినాన్ని ప్రత్యేక అవసరాలున్న పిల్లల మధ్య నిర్వహించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. పాఠశాల నిర్వాహకులు సూత్రపు బుచ్చిరాములు మాట్లాడుతూ దివ్యాంగుల మధ్య జన్మదిన వేడుకలు జరపడం అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు పిల్లల్లో ఎంతో ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని నింపుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నాయకులు చింతల కౌశిక్, శ్రీనివాస్, గురుకుంట్ల మధుకర్, మేకల రవీందర్, శివకుమార్, సన్నీ, సంపత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed