ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ‘ఛలో పార్లమెంట్’.. హుజరాబాద్‌లో పోస్టర్ ఆవిష్కరించిన TWJF నాయకులు

0
IMG-20260724-WA0027

కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్,జూలై 24: కేంద్ర ప్రభుత్వం పరిధిలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించనున్న ‘ఛలో పార్లమెంట్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు పిలుపునిచ్చారు. శుక్రవారం హుజరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో వివిధ ప్రజాసంఘాల నాయకులతో కలిసి జర్నలిస్టులు ఛలో పార్లమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బాపురావు మాట్లాడుతూ.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో పాత్రికేయుల ప్రధాన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. కోవిడ్ సమయంలో నిలిపివేసిన 50 శాతం రైల్వే ప్రయాణ రాయితీని వెంటనే పునరుద్ధరించాలని, దేశంలో పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే రిటైర్డ్ జర్నలిస్టుల కోసం జాతీయ పెన్షన్ పథకం అమలు చేయడం, ప్రెస్ కౌన్సిల్ స్థానంలో జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు చేయడం, ఎలక్ట్రానిక్ , డిజిటల్ మీడియాలకు పూర్తి చట్టబద్ధత కల్పించాలన్నారు. పాత్రికేయ సంఘాలు, హౌసింగ్ సొసైటీలకు భూముల కేటాయింపుపై సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించి, దేశవ్యాప్తంగా ఇళ్ల స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ డిమాండ్ల సాధన కోసం జరిగే ధర్నాలో జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, ధర్నా అనంతరం కేంద్ర మంత్రులు, ఎంపీలకు వినతిపత్రాలు సమర్పిస్తామని వెల్లడించారు. జర్నలిస్టుల న్యాయమైన పోరాటానికి బీసీ జేఏసీ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు సౌడమల్ల యోహాన్, నాయకులు రాఘవుల శ్రీనివాసు, రాజేంద్రప్రసాద్, ఇప్పకాయల సాగర్, శంకర్, శ్రీనివాస్, రవీందర్, కొండ గణేష్, కొలిపాక క్రాంతికుమార్, మామునూరి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed