కరీంనగర్ · July 24, 2026

చెత్త బయట వేస్తే అపరాధ రుసుము తప్పుదు: మున్సిపల్ కమిషనర్ జి. మల్లికార్జున స్వామి

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 24: రోడ్లపై చెత్త వేస్తే కఠిన చర్యలు తప్పవని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ జి. మల్లికార్జున స్వామి హెచ్చరించారు. ఆయన ఆదేశాల మేరకు శుక్రవారం జమ్మికుంట ప్రధాన రహదారిపై మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక పారిశుద్ధ్య తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా ఒక స్వీట్ హౌస్, ఒక కిరాణా దుకాణం యాజమాన్యాలు తమ వ్యాపార సంస్థల నుంచి వెలువడిన చెత్తను రోడ్డుపైనే వేసినట్లు సిబ్బంది గుర్తించారు.మున్సిపల్ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిన సదరు రెండు వ్యాపార సంస్థలకు రూ.1,000 చొప్పున అపరాధ రుసుము విధించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వ్యాపారులు , ప్రజలు తమ దుకాణాలు, ఇళ్ల నుంచి వచ్చే చెత్తను ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై వేయకూడదని, తప్పనిసరిగా మున్సిపాలిటీ చెత్త సేకరణ వాహనాలకే అందజేయాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతను దెబ్బతీస్తూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఇలాంటి జరిమానాలు, చర్యలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో మున్సిపల్ జవాన్లు కె. కిరణ్, దొడ్డ సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor