ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు.. కేక్ కట్ చేసిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 24: బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను జమ్మికుంట పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ చౌరస్తాలో బిఆర్‌ఎస్ శ్రేణుల మధ్య మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ముఖ్యాతిథిగా హాజరై కేక్ కట్ చేసి కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. కేటీఆర్ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో కలకాలం జీవించాలని, ప్రజాసేవలో ఇలాంటి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. పార్టీ బలోపేతానికి, తెలంగాణ అభివృద్ధికి కేటీఆర్ అందిస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కౌన్సిలర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

