కరీంనగర్ · July 27, 2026

కారు ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దారి మైసమ్మ వార్షికోత్సవం, అన్నదానం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 27: జమ్మికుంట పట్టణంలోని హుజురాబాద్ రోడ్డులో గల పాల కేంద్రం వద్ద దారి మైసమ్మ అమ్మవారి మొదటి వార్షికోత్సవాన్ని జమ్మికుంట కారు ఓనర్స్ , డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ యాంసాని శంకరయ్య నేతృత్వంలో వేద పండితులు, పూజారుల సమక్షంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి, పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఈ పూజల అనంతరం సుమారు 200 మందికి పైగా భక్తులకు, స్థానికులకు వినూత్నంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన ఈ వేడుకల్లో కారు ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు మాచర్ల వినయ్ కుమార్, మహమ్మద్ రఫీక్, సమ్మయ్య, కొమురయ్య, మిరియాల రాజు, అక్బర్, రాజేష్, లచ్చన్నలతో పాటు పెద్ద సంఖ్యలో డ్రైవర్లు, స్థానికులు పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor