కరీంనగర్ · July 28, 2026

కోరపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,జూలై 28: కోరపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్)లో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు కుర్ర సమ్మయ్య విద్యార్థులకు ఉచితంగా ఈ నోట్ బుక్స్‌ను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ కందికట్ల మధుసూదన్ మాట్లాడుతూ… విద్య యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా తెలిసిన వ్యక్తిగా, పాఠశాల విద్యార్థులకు ప్రోత్సాహకంగా నోట్ బుక్స్ అందజేసిన సమ్మయ్య ఉదారతను అభినందించారు.అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం) డబ్బేట రవీందర్ మాట్లాడుతూ… విద్య దానమే అన్ని దానాల కన్నా మిక్కిలి గొప్పదని, ఆ విషయాన్ని గ్రహించి విద్యార్థుల భవిష్యత్తు కోసం సమ్మయ్య చేసిన సేవ కొనియాడదగినదని అన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ స్రవంతి రాజు, పాఠశాల ఉపాధ్యాయులు గుడిమల్ల బలరాం, ఎస్. కుమారి, ప్రీ-ప్రైమరీ టీచర్ జి. శైలజ, విద్యా వాలంటీర్ రేఖతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor