మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం
హైదరాబాద్,వి90న్యూస్,జూలై 31: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన క్రియాశీలక పాత్ర ఎప్పటికీ మరువలేనిదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించిన ముఖ్యమంత్రి, వారి కుటుంబ సభ్యులకు, అనుచరులకు, శ్రేయోభిలాషులకు తన ప్రగాఢ సానుభూతిని, తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.

