కరీంనగర్ · August 14, 2026

వీధి వ్యాపారులకు బిగ్ రిలీఫ్: యూజర్ చార్జీలు భారీగా తగ్గిస్తూ జమ్మికుంట మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయం

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 14: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని వీధి వ్యాపారులపై ఎలాంటి అనవసరమైన ఆర్థిక భారం పడకుండా యూజర్ చార్జీలను గణనీయంగా తగ్గించాలని మున్సిపల్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణంలో మున్సిపాలిటీ అందిస్తున్న పారిశుద్ధ్య, చెత్త సేకరణ , ఇతర ప్రజా సేవలను వ్యాపారులు వినియోగించుకుంటున్న నేపథ్యంలో, మొదట రోజుకు ₹100 చొప్పున నెలకు ₹3,000, సంవత్సరానికి ₹36,000 వసూలు చేయాలని ప్రతిపాదించారు. అయితే, వ్యాపారుల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ సభ్యులు, కమిషనర్ , శానిటేషన్ సిబ్బంది సుదీర్ఘంగా చర్చించి, చార్జీలను రోజుకు కేవలం ₹11 (సంవత్సరానికి ₹4,800)గా ఖరారు చేస్తూ వ్యాపారులకు ఊరట కల్పించారు.ఈ వసూళ్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగుతుందని, వ్యాపారులు చెల్లించే ప్రతి రూపాయికి మున్సిపాలిటీ తరఫున తప్పనిసరిగా అధికారిక రసీదు అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. “వీధి వ్యాపారుల అభివృద్ధి – మున్సిపల్ అభివృద్ధిలో భాగస్వామ్యం” అనే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యాపారులంతా సహకరించాలని కౌన్సిల్ కోరింది. నిర్ణయించిన చార్జీలను సక్రమంగా చెల్లిస్తూ, తమ వ్యాపార ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, జమ్మికుంట పట్టణాన్ని మరింత సుందరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor