పోచమ్మ తల్లి ఆలయంలో బోరు బావి పనులు ప్రారంభం: దాత బండి శ్రీకాంత్‌కు మున్సిపల్ చైర్మన్ సత్కారం
కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 14: జమ్మికుంట పట్టణ పరిధిలోని 11వ వార్డులో గల శ్రీ పోచమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో నూతనంగా బోరు బావి వేయిస్తున్న దాత బండి శ్రీకాంత్‌ను మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించి, మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం ఆలయ వద్ద కొబ్బరికాయ కొట్టి బోరు బావి తవ్వకం పనులను ఆయన అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో బోరు బావిలో పుష్కలంగా నీరుపడి, భక్తులకు , పట్టణ ప్రజలకు తాగునీటి ఎద్దడి కలగకుండా ఉండాలని ఆకాంక్షించారు. పోచమ్మ తల్లి కృపాకటాక్షాలతో జమ్మికుంట పట్టణ ప్రజలందరూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పొనగంటి విష్ణు, పొనగంటి రాము, శీలం శ్రీనివాస్, కొలుగూరి సురేష్, తూర్పాటి చందన శంకర్, మంద రాజేష్, పొనగంటి అంజయ్యతో పాటు శివగంగ బోర్ వెల్స్ నిర్వాహకులు తూర్పాటి పోచయ్య, బిట్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

