కరీంనగర్ · August 15, 2026

జమ్మికుంట TWJF ప్రెస్ క్లబ్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అధ్యక్షుడు సౌడమల్ల యోహన్

కరీంనగర్/జమ్మికుంట,వి90 న్యూస్,ఆగస్టు 15: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఉత్సాహంగా, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అధ్యక్షులు సౌడమల్ల యోహన్ మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహానీయుల త్యాగాలు అమూల్యమైనవని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. సమాజ హితం కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం విలేకరులు ఎల్లప్పుడూ ముందుంటారని పేర్కొంటూ పట్టణ ప్రజలకు, విలేకరుల మిత్రులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకల్లో జర్నలిస్టులు, యూనియన్ నాయకులు భానుచందర్, దొడ్డే రాజేంద్రప్రసాద్, ఖాజా ఖాన్, దెయ్యాల సుధాకర్, కందుకూరి రాజు, ఎల్ల స్వామి, కొండపాక రాజు, కొక్కుల రాములు, శ్రీరామ్, రచ్చ రవి కృష్ణ, వంశీకృష్ణ, సంతోష్, నాగపురి రాజులతో పాటు పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor