కరీంనగర్ · August 15, 2026

ఘనంగా వొడితల ప్రణవ్ జన్మదిన వేడుకలు నియోజకవర్గవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు

ADVERTISEMENT
GROW YOUR BUSINESS WITH US
Reach local customers through ICON News
CONTACT US

కరీంనగర్/హుజురాబాద్,వి90 న్యూస్, ఆగస్టు 15: హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, అభిమానుల నడుమ అత్యంత వైభవంగా జరిగాయి. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రణవ్, అనంతరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా హుజురాబాద్ హనుమాన్ దేవస్థానం , అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు.

హనుమాన్ ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులకు ప్రణవ్ కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు.పుట్టినరోజు సందర్భంగా హుజురాబాద్, జమ్మికుంట, కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రులలో రక్తదాన శిబిరాలు, రైతు కూలీలకు చీరల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలను నాయకులు నిర్వహించారు. సుమారు 150 మంది కార్యకర్తలు, యువకులు ఈ శిబిరాల్లో రక్తదానం చేశారు.ఈ వేడుకల్లో ప్రణవ్ మాట్లాడుతూ, తనపై నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజల ఆశీస్సులతో మరింత సేవ చేస్తానని, కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రతీ సంక్షేమ పథకాన్ని గడపగడపకూ చేరవేసేందుకు కృషి చేస్తానని ఆయన ఆకాంక్షించారు. అతి తక్కువ సమయంలోనే ప్రజల మద్దతు పొంది, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా శ్రమిస్తున్నారని పలువురు నేతలు కొనియాడారు.ఈ వేడుకల్లో హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, వైస్ చైర్‌పర్సన్ అంజలిలతో పాటు దేవస్థాన, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్లు, జడ్పీటీసీలు, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా, యూత్, NSUI, సేవాదళ్ , సోషల్ మీడియా విభాగాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Generate ePaper Clip

Raj Kandukuri
News Presented By:

Raj Kandukuri

Editor